వాలీబాల్ ఫైనల్లో భారత్.. ఆఖరి పోరు పాక్‌తో

ఖాట్మాండు: నేపాల్ వేదికగా దశరథ స్టేడియంలో జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల వాలీబాల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సెమీఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ శ్రీలంక జట్లుపై విజయం సాధించింది. కాగా మరో సెమీస్‌లో పాకిస్థాన్ బంగ్లాదేశ్‌ను ఓడించడంతో భారత్-పాక్‌ల మధ్య ఫైనల్ పోరు నెలకొంది. మరోపక్క మహిళల విభాగంలోనూ భారత మహిళా వాలీబాల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళ విభాగంలోనూ చాంపియన్ అయిన భారత్ ఆఖరి పోరులో నేపాల్‌తో తలపడనుంది. కాగా మహిళ సెమీఫైనల్లో భారత్ మాల్దీవులుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్లో నేపాల్ శ్రీలంకపై నెగ్గింది. అయితే ఈ రెండు ఫైనల్ మ్యాచ్‌లు మంగళవారం జరుగనున్నాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/