విశాఖ చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు

south africa


విశాఖపట్నం: టీమిండియాతో మూడు టీ20ల సీరిస్‌ను సమం చేసిన ఉత్సాహంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు విశాఖ నగరానికి చేరుకుంది. సఫారీ జట్టుతోపాటు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవల్‌ జట్టు కూడా నగరంలో అడుగుపెట్టింది. గురువారం నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి-ఏడిసిఏ స్టేడియంలో ఇరుజట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు. వీరికి అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/