ఫీల్డింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ స్కోరు 43/1

eng vs sa match
eng vs sa match

ఓవెల్‌ వేదికగా జరుగుతున్న క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ల జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఓపెనర్లుగా జాసన్‌ రా§్‌ు, జానీ బెయిర్‌స్టౌలు బరిలోకి దిగారు. జానీ బెయిర్‌స్టౌ (0) తాహిర్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. ప్రస్తుతం క్రీజులో జాసన్‌రా§్‌ు(21), జోరూట్‌(21)లు ఉన్నారు. 7 ఓవర్లకు ఒక వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికా జట్టు: హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, అయిడెన్‌ మార్క్రం, ప్లెసిన్‌(కెప్టెన్‌) రస్సీ వాన్‌ దర్‌ డుస్సెన్‌, డుమిని, ఆండిలే ఫెలుక్వాయో, డ్వ్రైన్‌ ప్రిటోరియస్‌, రబాడా, లుండి ఎన్గిడి, ఇమ్రాన్‌ తాహిర్‌.
ఇంగ్లాండ్‌: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జోరూట్‌, జేసన్‌ రా§్‌ు, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/