మళ్లీ జట్టులోకి రావాలని డివిలియర్స్‌, తిరస్కరించిన బోర్డు

de Villiers
de Villiers

లండన్‌: సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఏబి డివిలియర్స్‌ గత ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐతే ఈ యేటి వరల్డ్‌కప్‌ కోసం మళ్లీ జట్టులోకి వచ్చేందుకు డివిలియర్స్‌ ప్రయత్నాలు చేశాడు కాని ఫలించలేదు. టీం యాజమాన్యం ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చింది. వరల్డ్‌కప్‌లో సఫారీలు వరుసగా మూడు మ్యాచ్‌లను ఓడిపోయింది. దీంతో ఆ జట్టు తీవ్ర గందరగోళంలో పడింది. డివిలియర్స్‌ ఉంటే బాగుండేదేమో అనే వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. ఐతే జట్టులోని 15 మంది సభ్యుల బృందం ఇంగ్లండ్‌కు బయలుదేరే 24 గంటల ముందు డివిలియర్స్‌ ఈ ప్రయత్నం చేసినట్లు తాజాగా వెల్లడైంది. డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకున్నా..సఫారీ బోర్డు మాత్రం డివిలియర్స్‌కు అవకాశం ఇవ్వలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/