పాట పాడిన జీవా.. మురిసిపోయిన ధోనీ

MS Dhoni his daughter Ziva
MS Dhoni his daughter Ziva

డెహ్రాడూన్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కూతురు జీవా ధోనీ పాట పాడింది. ఈ పాటకు గాను మన మహేంద్రుడు ఎంతగానో మురిసిపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. జీవా గిటార్ వాయిస్తూ.. ఈక్వెస్ట్రియా ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌ సాంగ్‌ పాడిన వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మంచు జీవాలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తెచ్చింది’ అని వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ వీడియోకు పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే దాదాపు 10 లక్షల లైకులు వచ్చాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా డెహ్రాడూన్‌లోని హిల్‌స్టేషన్‌లో మంచు కురుస్తుండగా.. ధోనీ తన కూతురు జీవాతో కలిసి సందడి చేశాడు. తండ్రితో పాటు జీవా కూడా స్నో మ్యాన్‌ను తయారు చేసింది. ధోనీ, జీవా కలిసి బుల్లి మంచు మనిషిని రూపొందిస్తుండగా.. తీసిన వీడియోను మహీ భార్య సాక్షి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/