బ్యాటింగ్‌లో స్మిత్‌ టాప్‌

Smith: Batting Topper
Smith: Batting Topper

బౌలింగ్‌లో కమిన్స్‌

Dubai: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌ విభాగంలో ఆసీస్‌ ఆట గాడు స్టీవ్‌ స్మిత్‌ తన నంబర్‌వన్‌ ర్యాంకుకు నిలుపు కున్నాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అధిగమించి టాప్‌ ర్యాంకును కైవసం చేసుకున్న స్మిత్‌ దాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం స్మిత్‌ 937 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా, విరాట్‌ కోహ్లీ 903 పాయింట్లను అందుకునేందుకు స్మిత్‌ స్వల్ప దూరంలో నిలిచాడు. 2017లో స్మిత్‌ 947 రేటిం ప్‌ పాయింట్లతో టాప్‌ను దక్కించుకోగా, ఆపై ట్యాం పరింగ్‌ వివాదం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురి కావడంతో టాప్‌ను కోల్పోయాడు. ఈ క్రమంలోనే దాన్ని కోహ్లీ అధిగమించాడు. కాగా, యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న స్మిత్‌ తన కెరీర్‌ అత్యధిక రేటింగ్‌ పాయింట్లకు కేవలం 10 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకు స్మిత్‌ 671 పరుగులు సాధించడంతో టాప్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే ఓవరాల్‌గా బ్యాట్స్‌మెన్‌ విభాగంలో అత్యధిక రేటింగ్‌ పాయింట్లను సాధించేందుకు స్మిత్‌ 25 రేటింగ్‌ పాయింట్ల దూరంలో ఉన్నాడు. 1948లో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ సర్‌ బ్రాడ్‌మన్‌ 961 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. ఇదే నేటికి రేటింగ్‌ పాయింట్ల పరంగా టెస్టుల్లో అత్యధికం. ఇక బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ టాప్‌ పదిలం చేసుకున్నాడు.

Cummins: Bowling Topper
Cummins: Bowling Topper


914 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అయితే ఆసీస్‌ తరపున రేటింగ్‌ పాయింట్లపరంగా మెక్‌గ్రాత్‌ సరసన నిలిచాడు కమిన్స్‌. 2001లో మెక్‌గ్రాత్‌ 914 రేటింగ్‌ పాయింట్లే ఆసీస్‌ తరపున టెస్టుల్లో అత్య ధికం. ఇప్పుడు అతని సరసన కమిన్స్‌ స్థానం సంపా దించాడు. యాషెస్‌ సరీస్‌లో కమిన్స్‌ అద్భుతమైన బౌలింగ్‌ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో తన రేటింగ్‌ పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు.
నాల్గో టెస్టులో కమిన్స్‌ ఏడు వికెట్లు సాధించడం అతని రేటింగ్‌ పాయింట్లు పెరగడానికి ప్రధాన కారణమైంది. ఓవరాల్‌గా చూస్తే 914 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 1914లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ సిడ్నీ బార్న్స్‌ సాధించిన 932 రేటింగ్‌ పాయింట్లే ఇప్పటివరకు టెస్టు ఫార్మట్లో అత్యధికం.