షాట్‌పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌పై నిషేధం…

manpreet kaur
manpreet kaur

భారత షాట్‌ పుటర్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు మన్‌ప్రీత్‌పై డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఈవిషయాన్ని నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ ప్రకటించారు. 2017లోమన్‌ప్రీత్‌ కౌర్‌ డోప్‌ పరీక్షల్లో నాలుగుసార్లు విఫలమైంది. 2017 జూలై 20 నుంచి మన్‌ప్రీత్‌పై నిషేధం అమల్లోకి వస్తుంది. దీంతో మన్‌ప్రీత్‌ 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణాన్ని, జాతీయ రికార్డు (18.86మీ)ను మన్‌ప్రీత్‌ కోల్పోనుంది. అయితే తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌చేస్తూ యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌కు మన్‌ప్రీత్‌ అప్పీల్‌ చేసుకునే అవకాశంను కల్పించారు. 2017లో ఆసియా గ్రాండ్‌ ఫ్రి, ఫెడరేషన్‌ కప్‌, ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌, ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షిప్‌లలో మన్‌ప్రీత్‌ కౌర్‌కు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించగా…నాలుగుసార్లు ‘పాజిటివ్‌గా తేలింది. ఒకసారి మెటనొలోన్‌, మూడుసార్లు డైమిథైల్‌బుటిలమైన్‌ వంటి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో నాడా మన్‌ప్రీత్‌ కౌర్‌పై వేటు వేసింది.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/S