ఇండియా, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ ఆపేయడం సరికాదు

విదేశాల్లోని తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించవచ్చు

shoaib akhtar
shoaib akhtar

పాకిస్థాన్‌: ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లను ఆపేయడం సరికాదని.. అన్ని ఆటల్లో లేనిది క్రికెట్ లో ఎందుకు ఉండాలని పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఉల్లిపాయలు, ఆలుగడ్డల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని ప్రశ్నించారు. అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరగడం క్రికెట్ కు మంచిదని వ్యాఖ్యానించారు.ఇండియా ప్లేయర్లు పాకిస్థాన్ కు, పాకిస్థాన్ ప్లేయర్లు ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని.. అయితే విదేశాల్లోని తటస్థ వేదికలపై మ్యాచ్ లు నిర్వహించవచ్చు కదా అని షోయబ్ అక్తర్ అన్నారు. తాము సచిన్ ను, గంగూలీని, సెహ్వాగ్ ను ఎంతగానో ఇష్టపడతామన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలు క్రికెట్ పై ప్రభావం చూపకూడదన్నది తన అభిప్రాయమని చెప్పారు. త్వరలోనే ఇండియా, పాక్ మ్యాచ్ లు జరుగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/