ధావన్‌ సెమీఫైనల్స్‌ కూడా ఆడతాడు

ఆశాభావం వ్యక్తం చేసిన కోహ్లి

shikhar dhawan
shikhar dhawan

నాటింగ్‌హామ్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఓపెనర శిఖర్‌ ధావన్‌ పరిస్థితిపై తాజాగా స్పందించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలికి గాయమైన ధావన్‌కు మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచకప్‌లో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. ఐతే గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దైన తర్వాత కోహ్లి మాట్లాడుతూ ..తర్వాతి మ్యాచుల్లో ధావన్‌ తిరిగి ఆడతాడని తెలిపాడు. రెండు ,మూడు వారాల తర్వాత అతని పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. ధావన్‌ త్వరగా కోలుకుని మిగతా లీగ్‌ మ్యాచులతో పాటు సెమీఫైనల్స్‌లో ఆడతాడని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచులో రోహిత్‌కు జోడిగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/