ఇరగదీసిన షమీ

mohammed shami
mohammed shami

రాంచీ: టీమిండియా భౌలర్ల చెతిలో వణికిపొతున్న దక్షిణాఫ్రికా భారత్‌ పెస్‌ భౌలింగ్‌ వల్ల డీకాక్‌(5) హమ్జా(0), డుప్లెసిస్‌(4), బావుమా (0)ల వికెట్లను కోల్పోయింది. ఈ నాలుగు వికెట్లతో షమీ మూడు వికెట్లను సాధించగా, ఉమేష్‌యాదవ్‌ ఒక వికెట్‌ తీసాడు. షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి సఫారీలు ఆపసోపాలు పడుతున్నారు. షమీ విజృంభణతో సఫారీల బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూప్పకులి
పొయింది. టీమిండియాతో మూడో టెస్టులో ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా వరస వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌ లో 162 పరుగులకే తొక మూడిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయారు. హమ్జా బౌల్డ్‌ చేసిన షమీ..డుప్లెసిస్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపించాడు. ఆపై బావుమాకు షమీ అధ్బుతమైన బంతిని సంధించడంతో
సాహకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకు ముందు తొలి వికెట్‌గా డీకాక్‌ను ఉమేష్‌యాదవ్‌ ఔట్‌ చేశాడు. మూడో రోజు టీ విరామనికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఉమేష్‌ యాదవ్‌ నుంచి దూసుకొచ్చిన బంతి ఎల్గర్‌కు బలంగా తాకింది. దాంతో జట్టు ఫిజియోథెరఫీ హుటహుటీగా మైదనాంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/