బిర్యానీ తిన్న తర్వాత షమి ఉత్సాహంగా ఉంటాడు: రోహిత్‌

SHAMI
SHAMI

విశాఖ:దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిం డియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండు వరుస శత కాలతో చెలరేగిపోతే, పిచ్‌ పరిస్థి తిని చక్కగా అర్థం చేసుకున్న పేసర్‌ షమీ తన బౌలింగ్‌ పవర్‌ చూపిం చాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కూడా సాధించిన షమీ చివరి రోజు అద్భుతాలు చేస్తాడని ముందుగా ఊహించినట్లే ఐదు వికెట్లను ఖాతాలో వేసుకుని సఫారీల పతనాన్ని శాసించాడు. చివరి రోజు ఆటలో లంచ్‌ బ్రేక్‌ తర్వాత పీయడ్త్‌కు వేసిన బంతికి వికెట్‌ విరిగి పోవడం షమీ బౌలింగ్‌లో వేగానికి నిదర్శనం. ఆఫ్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేరుగా వికెట్ల పైకి దూసుకుపోయింది. ఇందులో ఒక స్టంప్‌ ముక్కలైంది. దీన్ని భారత క్రికెట్‌ టీమ్‌ తన అధికారిక అకౌంట్‌లో కూడా పోస్ట్‌ చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో షమీ అదరగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్‌ ఏమిటో రోహిత్‌ వెల్లడించాడు. షమీ బిర్యానీ తినడమే తన అద్భుత గణాంకాలకు కారణమని చెప్పుకొచ్చాడు. బిర్యానీ తిన్న తర్వాత షమీ ఎంతో ఉత్సా హంగా ఉంటాడు. దీంతో అతడిలో అత్యుత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుందని నవ్వుతూ అన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/