షమీ అరెస్టుపై న్యాయస్థానం స్టే

Shami Arrest Issue:Court Given Stay
Shami Arrest Issue:Court Given Stay

కోల్‌కతా: భారత ఆటగాడు మహ్మద్‌ షమి అరెస్టుపై పశ్చి మ బెంగాల్‌లోని అలీపోర్‌ న్యాయస్థాం స్టే విధించింది. న్యా యస్థానం దాదాపు 2నెలల పాటు స్టే విధించిందని షమి తరపు న్యాయవాది సలీంరెహ్మాన్‌ తెలిపారు. ఈకేసు తదు పరి విచారణ నవంబర్‌ 2న జరుగుతుందని ఆయన పేర్కొ న్నారు. గృహ హింస కేసులో షమిపై అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వెస్టిం డీస్‌ నుంచి వచ్చి న 15 రోజుల లోపు లొంగిపో వాలని షమిని కోర్టు ఆదేశించిం ది. గత ఏడాది మార్చిలో షమిభార్య హసీన్‌జహాన్‌ అతడిపై కేసు పెట్టింది. అప్పటినుంచి షమి న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు అతడిపై అరెస్టు వారెంటు జారీ చేసింది. భార త్‌ తరపున షమి ఇప్పటివరకు 42 టెస్టు, 70వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. టెస్టుల్లో 153, వన్డేల్లో 131, టీ20ల్లో 8వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో అతడు హాట్రిక్‌తో చెలరేగిన విషయం తెలిసిందే.