ఫైనల్ నుంచి వైదొలగిన సెరీనా విలియమ్స్

Serena Williams
Serena Williams

టొరంటో : యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ముందు ఒక హార్డ్‌కోర్టు టైటిల్‌నైనా దక్కించుకోవాలన్న సెరీనా విలియమ్స్ ఆశలు గాయం కారణంగా గల్లంతయ్యాయి. టొరంటోలో జరుగుతున్న రోజర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన టీనేజర్ బియన్సా ఆండ్రెస్కూతో తలపడిన సెరీనా వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మొదలైన 19 నిమిషాలకే పోటీనుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పటికి సెరీనా 13 పాయింట్లతో వెనుకబడి ఉంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పిన సెరీనా హటాత్తుగా తొలి సెట్ మధ్యలో విశ్రాంతి సమయంలో కుర్చీలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తాను పోటీనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొని కెరీర్‌లో 24 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్న 37 ఏళ్ల సెరీనాకు ఈ గాయం ఒక అశనిపాతమేనని చెప్పాలి. ఈ టైటిల్‌ను గెలుచుకోవాలని తాను ఎంతగానో ప్రయత్నించాను కానీ అది సాధ్యం కాలేదంటూ అతి కష్టం మీద తన అభిమానులకు సారీ చెప్పింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national