నియమావళి ఉల్లంఘనకు పాక్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు ఫైన్‌

jofra archer, roy, sarfaraj
jofra archer, roy, sarfaraj


లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేవలం 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను పాక్‌ జట్టు సభ్యులతో పాటు మరో ఇద్దరు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు జరిమానా విధించారు.
నిర్ణీత సమయంలో ఓవర్‌ను వేయకుండా ఆలస్యం చేసినందుకుగాను పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కూడా జరిమానా విధించారు. స్లో ఓవరేట్‌ కారణంగా అతని మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించారు. అలాగా ఆజట్టులోని మిగతా ఆటగాళ్లకు తమ మ్యాచ్‌ ఫీజుల్లో 10 శాతం జరిమానా వేశారు. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో నిషేధిత వ్యాఖ్యలు లేదా అసభ్యకరంగా మాట్లాడినందుకు బ్యాట్స్‌మన్‌ జేసన్‌ రా§్‌ుకు 15 శాతం ఫైన్‌ వేశారు. అంపైర్‌ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు 15 శాతం జరిమానా పడింది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos