జీవితంలో మరువలేని మ్యాచ్‌

పాకిస్థాన్‌ జట్టు సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌

sarfaraz ahmed
sarfaraz ahmed, pakistan captain

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌ చేతిలో పాక్‌ చిత్తయిన సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో జరిగిన రెండో మ్యాచ్‌ రికార్డు స్థాయిలో మూడున్నర గంటల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌ను తన జీవిత కాలంలో ఎప్పటికీ మర్చిపోలేనని పాక్‌ జట్టు సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి మెగాటోర్నీలో ప్రారంభ మ్యాచ్‌లో ఎంత బాగా ఆడితే అంత ఆత్మ విశ్వాసం వస్తుంది. కానీ మేం ఈ విషయంలో విఫలమయ్యాం. మా జట్టును గెలుపు చాలా అవసరం. కానీ మ్యాచ్‌లో ఆట ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా మీద కాస్త ప్రభావం చూపింది. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి ఒత్తిడి పెంచే ఇలాంటి వాటిని మేం పునరావృతం చేయాలనుకోవడం లేదు. తాము అనుకున్నది జరగలేదని, బ్యాటింగ్‌ కాస్త గురితప్పినప్పటికి బౌలింగ్‌ మాత్రం చాలా బాగా చేయగలిగామని అన్నారు. అమీర్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడు మళ్లీ ఫాంలోకి రావడం సంతోషించదగినది. రాబోయే మ్యాచ్‌లకు అమీర్‌ మాకు బలం కానున్నాడని తెలిపాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/