జిమ్నాస్టిక్స్‌లో తప్పిదం…రెండు కాళ్లు పోగొట్టుకున్న సమంత…

Samantha Cerio to retire from gymnastics after shocking accident
Samantha Cerio to retire from gymnastics after shocking accident

ప్రజిమ్నాస్టిక్స్‌ క్రీడ అంటే నియంత్రణ చాలా అవసరం. నియంత్రణతో పాటు అనుభవం కూడా ముఖ్యం. ఈ ఆటలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక అంతే సంగతులు. తాజాగా ఓ క్రీడాకారిణి చిన్న పొరపాటుతో తన రెండు కాళ్లను విరగొట్టుకుంది. ఈ ఘటన అమెరికాలోని ఆబర్న్‌ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. అమెరికాలోని ఆబర్న్‌ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియా అనే జిమ్నాస్ట్‌ శుక్రవారం జరిగిన బేటన్‌ ఓగ్‌ రీజనల్‌ ఫైనల్‌ పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఫస్ట్‌ పాస్‌ చేస్తున్న సమంతా ఎగిరి మ్యాట్‌పై ల్యాండ్‌ అయ్యింది. ఈ సమయంలో ల్యాండింగ్‌ అదుపుతప్పడంతో ఒక్కసారిగా రెండు కాళ్లూ విరిగిపోయాయి. నొప్పితో సమంతా అక్కడే ఏడ్చేసింది. అయితే కొద్ది సమయం వరకు ఎవరికీ అర్థం కాలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆమె వద్దకు చేరుకునే వరకు కాళ్లు విరిగిన సంగతి తెలియరాలేదు. వెంటనే డాక్టర్లు వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి వైద్యం అందించారు. ఈ ఘటన జరిగిన రోజే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమంత సెరియా జిమ్నాస్టిక్స్‌ కెరీర్‌కు గుడ్‌బై ప్రకటించింది. గత 18ఏళ్లుగా కెరీర్‌కు జిమ్నాస్టిక్స్‌ ఎంతగానో తోడ్పడింది. ఇష్టమైన ఆటకు దూరం అవుతున్నందుకు బాధగా ఉందని సమంత తెలిపింది. ప్రస్తుతం సమంత కోలుకుంటోంది. ఆమెకు డాక్టర్లు మెరుగైన వైద్యంను అందిస్తున్నారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/