ధోనీకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

Dhoni
Dhoni

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీప్రస్తుతం కశ్మీర్‌లో భారత ఆర్మీతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ధోనీకి అతడి భార్య సాక్షి అద్భుతమైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది.అతడికి ఎంతో ఇష్టమైన ఖఎ జీప్‌ గ్రాండ్‌ చెరోకీగ అనే అద్భుతమైన కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ధోనీకి విషయాన్ని తెలియజేసింది. ఖఇంటికి వస్తున్నందుకు స్వాగతం. మొత్తానికి నీకిష్టమైన redbeast ఇంటికొచ్చింది. మహీ నిన్ను నిజంగా చాలా మిసవ్వుతున్నా! అంటూ పేర్కొంది.
కాగా ధోనీకి ఆగస్టు 15వరకు అక్కడే ఉండే ధోనీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లేహ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి తిరిగి ఇంటికి చేరుకుంటాడని తెలుస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/