అనారోగ్యంతో సైనా స్విస్‌ ఓపెన్‌ నుంచి ఔట్

స్విట్జర్ల్యాండ్‌: అనారోగ్యం కారణంగా భారత స్టార్‌ షట్లర్‌సైనా నెహ్వాల్‌ స్విస్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సైనా అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లిన సైనాకు కడుపునొప్పి తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్‌ పేజీలో సైనా పోస్ట్‌ చేశారు. ఇది నిజంగానే నాకు చేదు వార్త. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. నొప్పి ఎక్కువవడంతో స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యులు ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అన్నాశయ సంబంధిత సమస్యగా చెప్పారు. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నానని సైనా తెలిపారు.

మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/