స్విస్‌ ఓపెన్‌ నుండి తప్పుకున్న సైనా

Saina Nehwal
Saina Nehwal

బాసెల్‌: భారత స్టార్‌ షట్టర్‌ సైనా నెహ్వాల్‌ స్విస్‌ ఓపెన్‌లో సత్తా చాటాలని అక్కడకు అడుగుపెట్లారు కాని ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. అయితే సైనా అనారోగ్య కారణంతో ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. గత సోమవారం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా. ఇటీవల ముగిసిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఈ నొప్పితోనే కొన్ని మ్యాచ్‌లాడా. అయితే, ఇప్పుడు ఈ నొప్పి ఎక్కువవడంతో స్విస్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా స్వదేశం వచ్చేశా. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరబోతున్నాను. త్వరలోనే కోలుకుంటాననే నమ్మకంతో ఉన్నా అని సైనా ఆ పోస్టులో పేర్కొంది. తెలిపింది.


మరిన్ని తాజా క్రీడల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/