సెమీఫైనల్స్‌కు చేరిన సాయి ప్రణీత్‌

క్వార్టర్స్‌లో ఇండోనేషియా ఆటగాడిపై విజయం

Sai Praneeth
Sai Praneeth

టోక్యో: భారత్‌ షట్లర్‌ సాయిప్రణీత్‌ జపాన్‌ ఓపెన్‌ సూపర్ 750 టోర్నమెంట్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లోఅదరగొట్టాడు. టోక్యో వేదికగా ఈరోజు జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్తో 2112, 2115పై సునాయాస విజయం సాధించాడు. దీంతో అతడు జపాన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. దూకుడు మీదున్న ప్రణీత్‌ క్వార్టర్స్‌లో రెండు ఆటలను 36 నిమిషాల్లోనే పూర్తి చేయడం విశేషం.

అయితే ఇదిలా ఉండగా భారత్‌ తరఫున సాయి ప్రణీత్‌ ఒక్కడే ఇప్పటి వరకు జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌ చేరాడు. ఇదిలా ఉండగా భారత్‌ తరఫున సాయి ప్రణీత్‌ ఒక్కడే ఇప్పటి వరకు జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌ చేరాడు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/