కోచ్‌గా మారనున్న సచిన్‌

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్థం..

Sachin Tendulkar
Sachin Tendulkar

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల‌ కోసం విరాళాలు సేకరించేందుకు గాను ఫిబ్రవరి 8న క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ మ్యాచ్‌ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆల్ స్టార్ టి20 మ్యాచ్ కర్టెన్ రైజర్‌గా ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది. ఈ మ్యాచ్‌లో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రికీ పాంటింగ్ XI  జట్టుకు సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహారిస్తుండగా… షేన్ వార్నర్ XI  జట్టుకు కోర్ట్నీ వాల్ష్‌ కోచ్‌గా వ్యవహారించనున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్డ్స్ ధ్రువీకరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సచిన్, కోర్ట్నీలను తిరిగి ఆస్ట్రేలియాకు స్వాగతిస్తున్నందుకు మాకు గౌరవం ఉందన్నారు. ఆసీస్ గడ్డపై వారిద్దరూ ఆటగాళ్ళుగా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించారని… ఒక ప్రత్యేకమైన మ్యాచ్ కోసం వీరిని ఆహ్వానించడం… అందులో వారు పాల్గొనడాన్ని మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు. అదే రోజు మెల్‌బోర్న్ వేదికగా జంక్షన్ ఓవల్ స్టేడియంలో భారత-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్‌కు అందజేయనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/