క్రికెట్‌ కామెంటేటర్‌గా సచిన్‌

sachin tendulkar
sachin tendulkar

లండన్‌: ఇవాళ నుండి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో సచిన్‌ ఓపెన్స్‌ అగేన్‌ అన్న షో ప్రసారం కానున్నది. ఈ రోజు జరిగే ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు సచిన్‌ కామెంట్రీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి ఆ షో ప్రారంభం కానుంది. ఈ షోలో మాజీ మేటి క్రికెటర్లు కూడా ప్యానెల్‌లో ఉంటారు. ఆరు సార్లు ప్రపంచకప్‌ ఆడిన సచిన్‌ మొత్తం 2278 పరుగులు చేశాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/