టెస్టు మ్యాచ్‌ల కుదింపుపై సచిన్‌ వ్యతిరేకత

దీనికి బదులుగా నాణ్యమైన పిచ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచన

Sachin Tendulkar
Sachin Tendulkar

ముంబయి: ఐసిసి ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ వ్యతిరేకతను వ్యక్తపరిచారు.టెస్టు మ్యాచ్ నిడివిని ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించడానికి బదులు ఐసిసి నాణ్యమైన పిచ్ ల ఏర్పాటుపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చా
రు . పిచ్ బాగుంటే టెస్టు మ్యాచ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వివరించారు. కొత్త తరం అభిమానులను ఆకర్షించేందుకు ఆటకు సంబంధించి ప్రతి అంశాన్ని మార్చాల్సిన అవసరం లేదని సచిన్ అభిప్రాయపడ్డారు. టెస్టుల్లో చివరిదైన ఐదో రోజున స్పిన్నర్లకు పిచ్ ఎంతో సహకరిస్తుందని, అలాంటి వెసులుబాటును స్పిన్నర్లకు దూరం చేయడం సబబు కాదని అన్నారు. క్రికెట్ లో టెస్టు మ్యాచ్ ఫార్మాట్ స్వచ్ఛమైనదని, దీన్ని మార్చేందుకు ప్రయత్నించరాదని సూచించారు .

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/