సచిన్‌ టెండూల్కర్‌ భావోద్వేగ ట్వీట్‌

మీరు మా గుండెల్లో ఉంటారు ఆచ్రేకర్‌ సార్‌

Sachin Tendulkar & ramakant achrekar
Sachin Tendulkar & ramakant achrekar

ముంబయి: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌కు నివాళులు అర్పించారు. ఆచ్రేకర్‌ తొలి వర్ధంతిని పురస్కరించుకొని..మీరు ఎల్లప్పూడూ మా గుండెల్లోనే ఉంటారు ఆచ్రేకర్‌ సర్‌ అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా తన గురువుతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్‌ చేశాడు. కాగా కేవలం ఒక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినప్పటికీ తదనంతర కాలంలో గొప్ప కోచ్‌గా ఎదిగిన రమాకాంత్‌ ఆచ్రేకర్‌. గతేడాది జనవరి 2న కన్నుమూసిన విషయం తెలిసిందే. సచిన్‌, వినోద్‌ కాంబ్లి, ప్రవీణ్‌ ఆమ్రే వంటి ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయనను ద్రోణాచార్య అవార్డు వరించింది. 2010లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/