సచిన్‌ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మెనే : షాజాద్‌

Shahzad Ahmed
Shahzad Ahmed

లాహోర్‌: సచిన్‌ టెండూల్కర్‌…ప్రపంచంలో ఈపేరు తెలియని క్రికెటర్‌ గానీ క్రికెట్‌ అభిమాని గానీ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తన బ్యాటింగ్‌తో రికార్డులను తిరగరాసిన ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌…ప్రత్యర్థి జట్లలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, తాజాగా మరో క్రికెటర్‌ సచిన్‌ అభిమానుల జాబితాలో చేరిపోయాడు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షాజాద్‌…సచిన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. క్రికెట్‌ ప్రపంచంలో సచిన్‌ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మెనే అని పేర్కొన్నాడు. షాజాద్‌ తన అభిమానులకు ట్విట్టర్‌ వేదికగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. సచిన్‌ గురించి కొన్ని మాటలు చెప్పండి అంటూ…ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…ఉత్తమ బ్యాట్స్‌మెన్‌, ఆదర్శ ప్రాయుడు, అన్నిటికంటే అత్యుత్తమ మానవత్వం ఉన్న వ్యక్తి…అందరినీ ఒకేలా గౌరవిస్తారని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌ జట్టులో కీలక ఆటగాడైన షాజాద్‌ రాబోయే ప్రపంచకప్‌లో రాణించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/