ఒలింపిక్స్‌ నుంచి రష్యాకు 4 ఏళ్ల నిషేధం

Russia
Russia

రష్యా: ఒలింపిక్స్‌కు ముందు రష్యాకు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రూల్స్‌ను అతిక్రమించినందుకు గాను రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన ‘వాడా’ స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. టొక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో రష్యాలోని పలువురు అథ్లెట్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఈ డోప్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిన వారి డేటాను మాస్కోలోని ల్యాబ్‌లో భద్రపరిచారు. అలా భద్రపరిచిన డేటాను డిలీట్ చేసిన‌ట్లు ర‌ష్యా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మూడు వారాల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ర‌ష్యా ఒలింపిక్ సంఘానికి లేఖ రాసింది. రష్యా ఒలింపిక్ సంఘం నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోవడంతో వాడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్‌ యూరీ గానస్‌ మాట్లడుతూ నిషేధం తప్పేలా లేదు. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో మా వాళ్లకు టోక్యో ఒలింపిక్స్‌ (2020), బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ (2022) మెగా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు అని తెలిపారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/