అంపైర్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం

Rohit Sharma
Rohit Sharma
రాజ్‌కోట్‌: భారత్‌-బంగ్లా జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. ఇంతకు ఏం జరిగిందంటే… భారత బౌలర్‌ యజ్వేంద్ర చాహల్‌ వేసిన ఓ బంతికి సౌమ్య సర్కార్‌ను రిషబ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశారు. కాగా ఫీల్డ్‌ అంపైర్‌కు అనుమానంతో  థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించగా, సౌమ్య అవుట్‌ అయినట్లుగా రీప్లేలో ఉండగా.. నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో సహనం కోల్పొయిన హిట్‌మాన్‌ అంపైర్‌ అసభ్య పదజాలంతో దూషించాడు. కాగా సౌమ్య సర్కార్‌ది ఔటేనని ఫోర్త్‌ అంపైర్‌ ప్రకటించాడు. అంపైర్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహించిన వీడియో అంతర్జాలంలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు కామెంట్లు గుప్పిస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: