రాహుల్‌, రోహిత్‌ది అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం

K L Rahul, Rohit Sharma
K L Rahul, Rohit Sharma

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లిసేన 2019 ప్రపంచకప్‌లో పవర్‌ప్లే స్కోరు సాధించి రికార్డు నమోదు చేసుకుంది. 10 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్‌, రోహిత్‌శర్మలు క్రీజులో కుదరుకున్నారు. వీరిద్దరిదీ ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం.
టీమిండియా 21 ఓవర్లకు వికెట్లు నష్టపోకుండా 125 పరుగులు చేసింది. లోకేశ్‌ రాహుల్‌ (57), రోహిత్‌శర్మ(64)లు క్రీజులో ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/