దెబ్బ చిన్నదే..రేపటి మ్యాచ్ లో రోహిత్ ఆడతాడు:బీసీసీఐ

ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డ రోహిత్

rohit sharma
rohit sharma

న్యూఢిల్లీ: ఢిల్లీలో రేపు టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే, నిన్న ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటం కలవరపాటుకు గురి చేసింది. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ ఉదర భాగానికి బంతి బలంగా తగిలింది. నొప్పితో బాధ పడ్డ రోహిత్, ప్రాక్టీస్ ను ఆపేసి వెళ్లిపోయాడు. దీంతో, రోహిత్ రేపటి మ్యాచ్ లో ఆడతాడా, లేదా అనే ఆందోళన నెలకొంది. అయితే, రోహిత్ కు తగిలిన దెబ్బ సాధారణమైందేనని బీసీసీఐ ప్రకటించింది. రేపటి టీ20లో రోహిత్ ఆడతాడని తెలిపింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/