స్మిత్‌ కెప్టెన్సీ పదవిని చేపట్టాలి: పాంటింగ్‌

ricky ponting
ricky ponting

సిడ్ని. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చెపట్టాలని ఆస్ట్రెలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కెప్టెన్‌ టీమ్‌పై బ్యాంటింగ్‌ విఫలమవుతుండడంతో జట్టులో అతడి స్థానంపై ఊహగానాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా స్టీవ్‌స్మిత్‌ తిరిగి కెప్టెన్సి భాద్యతలు అందుకోవాలనే అక్కడి అభిమానులు భావిస్తున్నారు. టీమ్‌లో ఎన్ని రోజులు కొనసాగుతాడో అతని ఇష్టం కాని కెప్టెన్సి విషయంలో విఫలమయ్యాడు. వికెట్‌ కీపర్‌గా అత్యుతమ ఆటగాడు కాని కెప్టెన్సి విషయంలో తప్పుకుంటే అతని స్థానంలో స్మిత్‌ చూడాలని ఉందన్నారు. ఆసీస్‌ జట్టుకు అతడే సరైన నాయకుడని అన్నారు. ఈ విషయంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తుదినిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ స్మిత్‌ జట్టుపగ్గాలు చేపడితే అది అతడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపదని పాంటింగ్‌ అన్నాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/