సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: బాబర్‌ అజామ్‌…

BABAR AJAM
babar azam

కరాచీ: తమకు ఆస్ట్రేలియాలో ఎదురవ్వబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పేర్కొన్నాడు. ఇటీవల సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్‌గా తొలగించి బాబర్‌ అజామ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించగా, ఆ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైంది. దీనిలో భాగంగా మాట్లాడిన అజామ్‌…ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఢీకొట్టాలంటే సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. బౌలింగే తమ ప్రధాన ఆయుధమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక స్వదేశంలో జరిగిన శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కోల్పోవడం పట్ల అజామ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో వైస్‌కెప్టెన్‌గా నా ప్రదర్శన బాలేదు. ఇది అభిమానులకు తెలిసిన విషయమే. ప్రతీ ఆటగాడి కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలు అనేవి సహజం. శ్రీలంకపై మాది చాలా పేలవమైన ప్రదర్శన. అందులో వేరే ప్రశ్నేలేదు. నేను ఎప్పుడూ 120శాతం ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తా. ఇప్పుడు నేను కెప్టెన్‌ అయినంత మాత్రాన నాపై అదనపు ఒత్తిడి ఉంటుందని అనుకోవడం లేదు. నా సహజ సిద్ధమైన ఆటనే ఆడతా. అప్పుడే పూర్తిస్థాయి ఆట బయిటకు వస్తుంది.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/