అందరూ సంతోషం వ్యక్తం చేశారు

Ravi Shastri
Ravi Shastri

ఆంటిగ్వా: టీమిండియా కోచ్‌గా తిరిగి ఎన్నికైన తరువాత రవిశాస్త్రి ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘నన్ను తిరిగి కోచ్‌గా ఎంపిక చేయడం పట్ల కుర్రాళ్లు ఏమనుకున్నారో నా దగ్గరికి వచ్చి చెప్పారు. అందరూ సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ అంతా కలిసి జట్టుని విజయ పథంలో నడిపించాలని నిర్ణయించుకున్నాం. అలాగే మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వారికి అవగాహన ఉంది. వాటిని ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నాడు.
కపిల్‌దేవ్‌, అన్షుమాన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామిల ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా కమిటీ మూడు రోజుల క్రితం కోచ్‌ పదివికి ఇంటర్వ్యూలు చేసి రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేసిన విషయ తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/