రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు

Hesson
Hesson

ముంబయి: టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సందర్భంగా ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ అభినందనలు తెలిపాడు. ట్విటర్‌ ద్వారా ”టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా తిరిగి ఎంపికైనందుకు రవిశాస్త్రికి అభినందనలు. రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నాడు. ఇందుకు శాస్త్రి బదులిస్తూ.. ”వెయ్యి ధన్యవాదాలు, మైక్‌. మీ శుభాకాంక్షలకు అభినందనలు. మీ కోచ్‌ బాధ్యతలను అలాగే కొనసాగించండి” అని రీట్వీట్‌ చేశాడు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/