అరుదైన రికార్డును సాధించిన రషీద్‌

Rashid Khan
Rashid Khan

కాబూల్: అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్ లో అతి పిన్న వయసులోనే (20 ఏండ్ల 350 రోజులు) కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఘనతను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక మ్యాచ్ కు అఫ్ఘానిస్తాన్ జట్టుకు సారధిగా రషీద్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జింబాబ్వే కెప్టెన్ తైబు (20 ఏళ్ల 358 రోజులు)ల రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/