ట్రోఫీని మహ్మద్‌ నబీకి అంకితం చేస్తున్నా: రషీద్‌ ఖాన్‌

Rasheed Khan with Trophy
Rasheed Khan with Trophy

చిట్టగాంగ్‌: పసికూన అఫ్గానిస్తాన్‌ తన కంటే బలమైన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై ఏకైక టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. జట్టు గెలుపులో సారథి రషీద్‌ఖాన్‌ కీలకపాత్ర పోషించాడు. అర్థశతకంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రషీద్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో బంగ్లాను మట్టికరిపించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందని అందరూ భావించినా అఫ్గాన్‌ ఆటగాళ్లు అసాధారణ ప్రతిభతో విజయం సొంతం చేసుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మాయచ్‌ అందుకున్న రషీద్‌ ఖాన్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడాడు. ట్రోఫీని మహ్మద్‌ నబీకి అంకితం చేస్తున్నానని తెలిపాడు. లెజెండ్‌ నబీ జట్టుకు ఎన్నో సేవలు చేశాడు. అఫ్గానిస్తాన్‌ తరపున సేవలు అందించినందుకు అతడికి ధన్యవాదాలు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీని అతడికి అంకితం చేస్తున్నాను. విజయంలో బ్యాట్స్‌మెన్‌ కీలకపాత్ర పోషించారు. అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతడు ఆడిన మూడు టెస్టుల్లోనూ అంతగా ఆకట్టులేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 33 పరుగులే చేశాడు. బంగ్లాతో ఆడిన ఆఖరి టెస్టులోనూ 8 పరు గులే చేశాడు. కానీ నబీ పొట్టి ఫార్మట్‌లో కీలక ఆటగాడు. మ్యాచ్‌ రూపురేఖలనే మార్చే సత్తా అతడి సొంతం. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున నబీ ఆడుతున్నాడు.