మ్యాచ్‌కు అనుకూలించని వాతావరణం!

rain threat to match
rain threat to match

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన భారత్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై వర్షప్రభావం నెలకొంది. అక్కడ సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మైదానం చిత్తడిగా మారుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు. కాగా గురువారం మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌ మొత్తం జరిగే అవకాశం లేదు. ఇదిలా ఉండగా న్యూజిలాండ్‌ 6 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. నేటి మ్యాచ్‌ కనక రద్దైతే చెరో పాయింట్‌ లభిస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/