పీటీ ఉషకు అరుదైన గౌరవం

PT Usha
PT Usha

న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. 80వ దశకంలో ఆసియా ప్రఖ్యాత స్ర్పింటర్‌గా నీరాజనాలందుకున్న 55 ఏళ్ల ఉషకు ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (ఏఏఏ)లోని అథ్లెట్ల కమిషన్‌లో సభ్యురాలిగా చోటు లభించింది. హ్యామర్‌ త్రోలో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ ఆండ్రీ అబ్దువలిఏవ్‌ (ఉజ్భెకిస్థాన్‌) అధ్యక్షతన కూడిన ఆరుగురు సభ్యుల ఏఏఏ అథ్లెట్ల కమిషన్‌లో ఉష ఓ సభ్యురాలిగా వ్యవహరిస్తారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/