బట్లర్‌ ప్రొఫెషనల్‌ వికెట్‌ కీపరేనా?

BUTLER-
BUTLER-

బట్లర్‌ ప్రొఫెషనల్‌ వికెట్‌ కీపరేనా?

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ 2018 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ వికెట్‌ కీపర్‌ జోన్‌ బట్లర్‌ వరుస తప్పిదాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ ఒక స్టంపింగ్‌తో పాటు సులువైన రనౌట్‌ అవకాశాన్ని జారవిడిచారు. అయితే…మ్యాచ్‌పై ఈ తప్పిదాల ప్రభావం పడకపోవడంతో….చివరికి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ…టోర్నీలో ఇదే కీపింగ్‌ తడబాటు కొనసాగితే…రాజస్థాన్‌ జట్టుకి కష్టాలు తప్పేలా లేవు. 218 పరుగు భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగుళూరు జట్టు 8.4 ఓవర్లు ముగసిఏ సమయానికి 84/2తో నిలిచిన దశలో హిట్టర్‌ ఎబి డివిలియర్స్‌ను స్టంపౌట్‌ చేసే అవకాశాన్ని బట్లర్‌ చేజార్చుకున్నాడు. అనంతరం కొద్దిసేపటికే మళ్లీ డివిలియర్స్‌నే రనౌట్‌ చేసే ఛాన్స్‌ని జారవిడిచాడు.

అయితే…ఈ లైఫ్స్‌ని సరిగా వినియోగించుకోలేకపోయినా ఎబి డివిలియర్స్‌ (18బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 20 పరుగులు)తక్కువ స్కోరుకే ఔట య్యాడు. ఈ మ్యాచ్‌లో…చివరికి రాజస్థాన్‌ జట్టు 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కానీ…బట్లర్‌ తప్పిదాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెషన్‌ వికెట్‌ కీపర ్‌వేనా…? అయితే ఈ తప్పిదాలు ఏంటి…మరో కమ్రాన్‌ అక్మల్‌…అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు. ఐపిఎల్‌ 2018 ఆటగాళ్ల వేలంలో రూ.4.4కోట్లకి ఈ ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌/బ్యాట్స్‌మెన్‌ని రాజస్థాన్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.