ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రత్యేక విందు ఇచ్చిన బ్రిటన్‌ ప్రధాని

ఇంగ్లాండ్‌ జట్టుతో థెరిసా మే

England cricket team, Prime Minister Theresa May
England cricket team, Prime Minister Theresa May

లండన్‌: ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కాగా బౌండరీల సంఖ్య ప్రమాణికంగా ఇంగ్లాండ్‌ జట్టు నూతన ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో 44 ఏళ్ల ఇంగ్లాండ్‌ సుధీర్ఘ కల సాకారమైంది. ఈసందర్భంగా ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు సోమవారం బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ని కలిశారు. డౌనింగ్ స్ట్రీట్‌లోని ఆమె కార్యాలయం వద్ద ప్రపంచకప్‌తో పాటు ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆటగాళ్లు పాల్గొని సంతోషంగా గడిపారు. ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని, దేశ క్రీడా చరిత్రలో ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/