కెప్టెన్‌గా గర్వపడుతున్నా: విండిస్ కెప్టెన్ పొలార్డ్

Kieron Pollard
Kieron Pollard

తిరువనంతపురం: జట్టులోని యువ ఆటగాళ్లను చూసి ఎంతో సంతోషిస్తున్నానని విండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అన్నాడు. తిరువనంతపురం వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగత తెలిసిందే. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. మ్యాచ్ అనంతరం కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌ తర్వాత గొప్పగా పుంజుకున్నాం. నా అద్భుతమైన ఓవర్ తర్వాత టీమిండియాను 170 పరుగులకే కట్టడి చేశాం. ఇది చాలా అద్భుతంగా ఉంది. మా బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా ఆడారు. వారిని చూసి ఎంతో సంతోషిస్తున్నా. భారత్‌లో ఎన్నో మ్యాచులు ఆడాను. నా అనుభవాన్ని సహచరులతో పంచుకునేందుకు కెప్టెన్‌గా గర్విస్తున్నా. కొన్ని విభాగాల్లో ఇంకా మేము మెరుగవ్వాలి అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: