పిచ్‌ ధోనిపై అసహనం…

MS Dhoni
MS Dhoni

చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి పిచ్‌లు ఎవరికీ కావాలని పిచ్‌ క్యూరేటర్‌పై మండిపడ్డారు. మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పిచ్‌ నెమ్మదిగా ఉండటంతో…ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్‌ ఒక్కడే పోరాడి (44బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో 50) అజేయ అర్థసెంచరీ చేశాడు. అనంతరం స్వల్ఫ లక్ష్యాన్ని చెన్నై కష్టపడి ఛేదించింది. పిచ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో మరీ నెమ్మదించడంతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ పరుగుల చేయడానికి ఇబ్బంది పడ్డారు. డుప్లెసిస్‌ ఒంటరి పోరాటం చేసే చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్‌ ధోని మాట్లాడుతూ…ఇక్కడి మైదానంతో నాకు విడదీయని అనుబంధం ఉంది. చెన్నై జట్టుకు మొదటి స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా తొలి టెస్టు ఇక్కడే ఆడాను. ఇక్కడి అభిమానులు చెన్నై జట్టును చాలా ఆదరిస్తున్నారు. మ్యాచ్‌లను విజయాలతో ముగించాలనే మేము ప్రయత్నం చేస్తున్నామని ధోని తెలిపారు. ఇలాంటి పిచ్‌లపై ఆడాలని నేను అనుకోవట్లేదు. ఇలాంటి పిచ్‌లు ఎవరూ కోరుకోరు. వికెట్‌ నెమ్మదిస్తుంటే పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాం. ఇన్నింగ్స్‌ మొదట్లో మరీ దారుణంగా ఉంది. కొద్దిగా మంచు వచ్చిన తర్వాత పర్వాలేదనిపించింది. ఈపిచ్‌పై సమతూకమైన జట్టుతో దిగడం కూడా కష్టమే. ఇలాంటి వికెట్‌పై ఎవరు ఆడతారని ధోని మండిపడ్డారు. ఈసీజన్‌ మొదటి మ్యాచ్‌లో కూడా క్యూరేటర్‌ ఇలాంటిప ఇచ్‌నే సిద్ధం చేయడంతో…మొదటగా బ్యాటింగ్‌ చేసిన బెంగుళూరు 70 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అనంతరం స్వల్ఫ లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 18 ఓవర్లు ఆడి గెలుపొందింది. అప్పుడు కూడా ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports