టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

pakistan won the toss
pakistan won the toss

భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. వాతావరణం మేఘావృతమై ఉండటం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయడం వల్ల బౌలర్లకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పాడు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ గెలిచి ఉంటే మేమూ బౌలింగే ఎంచుకునే వాళ్లమని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. అయినా టాస్ కోల్పోయినందుకు నిరుత్సాహం లేదన్నాడు. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని చెప్పాడు. శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.