భారత్‌లో పాక్‌ జట్టు పర్యటన కష్టమే!

indian women cricket team
indian women cricket team


న్యూఢిల్లీ: భారత్‌ పాక్‌ల మధ్య దాయాదుల పోరు ఉందనే విషయం అందరీ తెలుసు. ఆర్టికల్‌ 370 రద్దు దగ్గర నుంచి రెండుదేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. భారత్‌లో పాక్‌ మహిళా జట్టు పర్యటన రద్దు కావ్వొచ్చని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) అధికారి తెలిపారు. ఈ ఏడాది నవంబరులో రగనున్న మూడువడ్డేల సీరీస్‌ను భారత్‌ రద్దు చేసుకోవచ్చని అన్నారు. ఐసిసి మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా స్వదేశంలో పాకిస్థాన్‌తో భారత్‌ మూడువడ్డేల సిరీస్‌ను తలపడాల్సి వుంది. కానీ ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ సీరిస్‌ రద్దు కావచ్చని పిసిబి అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ మహిళా జట్టు పర్యటనపై భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండి (బిసిసిఐ) కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/