భారత్‌ ప్రపంచ క్రికెట్‌ను శాసించడం ఖాయం!

Michael Vaughan
Michael Vaughan

అడిలైడ్‌: సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌లలో ఆస్ట్రేలియాను ఓడించడం ప్రత్యర్థి జట్లకు దాదాపు అసాధ్యం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కంగారులకు కళ్ళెం వేసే సత్తా ఒక్క టీమిండియాకు మాత్రమే ఉందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా ఆస్ట్రేలియా జోరును చూస్తుంటే పూర్వ వైభవం సంతరించుకున్నట్లు స్పష్టమవుతుందని వాన్‌ అన్నారు. అయితే ఆస్ట్రేలియాను ఓడించే సత్తా ఓక భారత్‌కు మాత్రమే ఉందని చెప్పారు. ఇకపోతే భారత జట్టు కూడా కొంత కాలంగా టెస్టుల్లో నిలకడగా విజయాలను కైవసం చేసుకుంటుందని వాన్‌ గుర్తు చేశారు. టెస్టు చాంపియన్‌ షిప్‌లో భారత్‌ ఇప్పటికే ఏడు వరుస విజయాలు సాధించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్యపోరు నువ్వానేనా అనే విధంగా సాగుతందన్నారు. అంతేకాకుండా మిగతా దేశాలకు చెందిన ఆటతీరుతో పోలిస్తే ఆస్ట్రేలియా చాలా మెరుగ్గా కనిసిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించడం ఖాయమని మైఖేల్‌ వాన్‌ చెప్పుకొచ్చారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/