భారత్‌పై న్యూజిలాండ్‌ విజయం

రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌

Team India
Team India

క్రైస్ట్‌చర్చ్‌: రెండో టెస్టులో న్యూజిలాండ్‌.. భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను ఆ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (52 పరుగులు 74 బంతుల్లో ), టామ్‌ బ్లండెల్‌(55 పరుగులు 113 బంతుల్లో ) అర్ధ శతకాలతో చెలరేగారు. చివర్లో లాథమ్‌.. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటవ్వగా.. కాసేపటికే బుమ్రా బౌలింగ్‌లో విలియమ్సన్‌(5) రహానె చేతికి చిక్కాడు. తర్వాత బుమ్రా.. మరో అద్భుత బంతికి బ్లండెల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అనంతరం వచ్చిన రాస్‌ టేలర్‌(5), హెన్రీ నికోల్స్‌(5) జట్టును విజయతీరాలకు చేర్చారు. బుమ్రా రెండు వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాద్‌ ఒక వికెట్‌ తీశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/