బ్యాటింగ్‌ యూనిట్ గురించి ఆందోళన అవసరం లేదు

Ravindra Jadeja
Ravindra Jadeja

లండన్‌: ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియాకివీస్‌తో వార్మప్‌ మ్యాచ్‌గురువారంఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.వార్మప్‌ మ్యాచ్‌లో ఇలా టీమిండియా విఫలం కావడంపై క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. ఇది మా తొలి మ్యాచ్‌ మాత్రమే. ఒక్క మ్యాచ్‌తో టీమిండియాని జడ్జ్‌ చేయడం సరికాదు. ఆటగాళ్ల నైపుణ్యాలను ప్రశ్నించడం చాలా బాధేసింది. ఇది ఒక బ్యాడ్‌ మ్యాచ్‌. బ్యాడ్‌ ఇన్నింగ్స్‌. కాబట్టి బ్యాటింగ్‌ యూనిట్ గురించి ఆందోళన అవసరం లేదు.మాకింకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ వైఫల్యాల మీద చర్చించుకుంటాం. ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను. బ్యాటింగ్‌ యూనిట్‌ ఇంకా కష్టపడుతుంది. ఈ జట్టులో ఉండే ప్రతి ఒక్కరికీ చాలా అనుభవం ఉంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని జడ్డూ చెప్పుకొచ్చాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/