టెస్ట్‌ మ్యాచ్‌ల ఫార్మాట్‌కు కోహ్లీ వ్యతిరేకత

డే నైట్‌ టెస్ట్‌ క్రికెట్‌కు సమూలంగా మార్పును తెస్తుందని భావన

Virat Kohli
Virat Kohli

గువహటి: టెస్టు మ్యాచ్‌ల ఫార్మాట్‌ కుదింపు ప్రతిపాదనను భారత సారథి విరాట్‌ కోహ్లీ వ్యతిరేకించారు. ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతూ.. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ల పద్ధతిని మార్చాల్సిన అవసరం అసలే లేదు. టెస్ట్‌ క్రికెట్‌ ను డే నైట్‌ పద్ధతిలో ఆడించడమంటే దాన్ని వ్యాపారాత్మకం చేసినట్లే అవుతుంది. దీనిలో ఇంతగా మార్పులు చేసి అందరిలో ఆందోళనలు కలిగించడం మంచిది కాదు. డే నైట్‌ పద్ధతే టెస్టు క్రికెట్‌ తీరును సమూలంగా మారుస్తుందని తాను భావిస్తున్నానని కోహ్లీ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు రోజుల స్థానంలో నాలుగురోజులకు కుదించి టెస్ట్‌ మ్యాచ్‌ ఫార్మాట్‌ ను ఐసిసి ప్రతిపాదించింది. దీనిని 2023 నుంచి అమలు చేయనున్నట్లు తెలిలింది. ఈ నేపథ్యంలో దీనిపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఈ విషయంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ ఐసిసి ప్రతిపాదనపై ఇప్పుడప్పుడే స్పందిచడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/