ఇద్దరు ప్రియ మిత్రులతో సరికొత్తగా

Sourav Ganguly
Sourav Ganguly

ముంబయి: క్రికెట్‌ మక్కాతో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీది ప్రత్యేక అనుబంధం ఉంది. తన కెరీర్‌ ప్రారంభం ఇక్కడే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో మొదలైంది. ఆ మ్యాచ్‌లో దాదా శతకం బాదాడు, ఆ తర్వాత నాటిగ్‌హామ్‌ టెస్టులోనూ శతకం బాది తనేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అంతేకాదు టీమిండియా సారథిగా 2002లోనూ నాట్‌వెస్ట్‌ సిరీస్‌ కైవసం చేసుకోగానే చొక్కా విప్పి మక్కా లార్డ్‌ బాల్కనీలో సంబరాలు చేసుకున్నాడు. ఆటగాడిగా, కామెంటేటర్‌గా లార్డ్స్‌లో అడుగుపెట్లే గంగూలీ ఈ సారి ఏకంగా బిసిసిఐ అధ్యక్షుడిగా అక్కడికి వెళ్లాడు. బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌సింగ్‌ ధూమాల్‌తో కలిసి లార్డ్స్‌ బాల్కనీలో సెల్ఫీ దిగి అది తన ట్విట్టర్‌ లో పెట్టాడు. అంతేకాకుండా ఇద్దరు ప్రియ మిత్రులతో సరికొత్త బాధ్యతలతో మరోసారి అంటూ దాదా ట్వీట్‌ చేశాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/