కివీస్‌కు 137 పరుగుల లక్ష్యం

NZ vs SL
NZ vs SL

కార్డిఫ్‌: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. ఆ జట్టును చివరివరకు కెప్టెన్‌ కరుణరత్నే ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. తిశార పెరీరాతో కలిసి స్కోరు బోర్డును గాడిలో పెట్టేందుకు ప్రయత్నించగా..సాంట్నర్‌ ఈ జోడిని విడదీశాడు. పెరీరా వెనుదిరగడంతో అతనికి సహకారం కరవయింది. 29.2 ఓవర్లకే లంకన్లు 136 పరుగులు చేసి ఆలౌటయ్యారు. హెన్రీ, ఫెర్గుసన్‌ 3 వికెట్లు, గ్రాంథోమ్‌, సాంట్నర్‌, బౌల్ట్‌, నీశమ్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. కరుణరత్నే (52), కుశాల్‌ పెరీరా(29), తిశారా పెరీరా(27) పరుగులు చేశారు. మిగతా వారు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/