న్యూజిలాండ్‌ జట్టుకు జరిమానా విధించిన ఐసిసి

Newzeland team
Newzeland team

లండన్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ జట్టు ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. ఐతే ఈ మ్యాచులో స్లో ఓవర్‌ రేట్‌ చేసినందుకు కివీస్‌ జట్టుకు ఐసిసి జరిమానా విధించింది. ఈ మ్యాచులో న్యూజిలాండ్‌ ఒక ఓవర్‌ స్లోగా వేసిందని మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ తెలిపారు.
ఇందుకుగాను ఐసిసి కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.22 ప్రకారం జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌కు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం, మిగతా జట్టు సభ్యులకు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు. న్యూజిలాండ్‌ విలియమ్‌సన్‌ కెప్టెన్సీలో మరో మైనర్‌ ఓవర్‌ రేటు నేరం చేస్తే, అతనిపై నిషేధం విధిస్తాం. అని ఐసిసి ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్‌లో జరిగన మ్యాచ్‌లో విజయంతో న్యూజిలాండ్‌ దాదాపు సెమీఫైనల్‌ బెర్త్‌ పక్క చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్‌..పాకిస్థాన్‌తో తలపడుతుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/